సమీక్ష: రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ – అక్కడక్కడా మెప్పించే లవ్ డ్రామా !

సమీక్ష: రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ – అక్కడక్కడా మెప్పించే లవ్ డ్రామా !

Published on Nov 7, 2025 12:35 PM IST

The-Girlfriend Movie

విడుదల తేదీ : నవంబర్ 07, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : రష్మిక మందన్న, ధీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి & ఇతరులు
దర్శకుడు : రాహుల్ రవీంద్రన్
నిర్మాతలు : విద్యా కొప్పినీడి & ధీరజ్ మొగిలినేని
సంగీత దర్శకుడు : హేషమ్ అబ్దుల్ వహాబ్
సినిమాటోగ్రాఫర్ : కృష్ణన్ వసంత్
ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో దీక్షిత్ శెట్టి హీరోగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ లవ్ థ్రిల్లర్ చిత్రమే “ది గర్ల్ ఫ్రెండ్”. ట్రైలర్ ప్రమోషన్స్ తో మంచి ఆసక్తి కలిగించిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్స్ లో విడుదల అయ్యింది. ఇక ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఒక అమాయకపు అమ్మాయి అయ్యిన భూమా దేవి (రష్మిక మందన్నా) ఇంగ్లీష్ లో తన ఎం ఏ పూర్తి చేయడానికి హైదరాబాద్ కి వస్తుంది. అలా తన కాలేజ్ లోనే వేరే బ్రాంచ్ కి చెందిన విక్రమ్ (దీక్షిత్ శెట్టి) తో పరిచయం అవుతుంది. అక్కడ నుంచి వారి పరిచయం ప్రేమగా మారుతుంది కానీ అది కాస్త నెమ్మదిగా మరోదారిలో వెళుతుంది. విక్రమ్ ప్రవర్తనలో టాక్సిక్ మార్పులు భూమాని ఎంతాగానో కలచివేస్తాయి. ఏది బయటకి చెప్పుకోలేని ఆ అమ్మాయి ఇలాంటి ఒక రిలేషన్ షిప్ ని ఎలా నెట్టుకొచ్చింది. చివరికి వీరి ప్రేమ కథ ఎలా ముగిసింది అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.

ప్లస్ పాయింట్స్:

నటిగా రష్మికా మందన్నా ఇది వరకు పలు చిత్రాల్లో సాలిడ్ పెర్ఫామార్ గా ప్రూవ్ చేసుకుంది. అయితే ఇలాంటి ఒక కొత్త రోల్ ఆమెలోని మరో కోణాన్ని చూపించిందని చెప్పాలి. భూమా అనే అమాయకపు అమ్మాయి పాత్రలో రష్మిక ఇమిడిపోయింది. ఆమెలోని సున్నితమైన ఎమోషన్స్ అద్భుతమైన నటనతో పలు వేరియేషన్స్ ని చూపించి ఆకట్టుకుంది. ఈ సినిమా చూస్తే ఆమె నుంచి ఇది మరో అవార్డు విన్నింగ్ పెర్ఫామెన్స్ అనిపించక మానదు.

నాచురల్ స్టార్ నాని దసరా సినిమాలో కీలక పాత్రలో కనిపించిన యువ నటుడు దీక్షిత్ శెట్టికి ఈ సినిమాలో కంప్లీట్ నెగిటివ్ రోల్ దక్కింది. ఒక టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ గా దీక్షిత్ విక్రమ్ అనే రోల్ లో నెక్స్ట్ లెవెల్ పెర్ఫామెన్స్ ని చూపించాడు. తన లోని గ్రే షేడ్స్ పాత్రకి ఎలా కావాలో అలాంటి పెర్ఫామెన్స్ ని డెలివర్ చేసి ఆడియెన్స్ లో కూడా ఒకరకమైన నెగిటివ్ భావనను తీసుకురాగలిగే నాచురల్ పెర్ఫామెన్స్ ని తాను అందించాడు.

ఇక సినిమాలో లీడ్ నటీనటులు నడుమ కొన్ని సన్నివేశాలు సాలిడ్ గా వర్కౌట్ అయ్యాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా విక్రమ్ ఇంటికి వెళ్లిన తర్వాత మారిన పరిస్థితులు నుంచి కథనం డీసెంట్ గా ఉంది. ఇక నటుడు రావు రమేష్ కూడా కీలక పాత్ర దక్కించుకోగా ఒక కీలక మూమెంట్ లో తన పాత్ర, ఇంకా నటన బాగా వర్క్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రాసుకుని ప్రెజెంట్ చేసిన కొన్ని సన్నివేశాలు మంచి ఆలోచనాత్మకంగా అనిపిస్తాయి. భూమా రోల్ ని ఒక ఇరుకైన బాత్రూంకి ప్రతిబింబించేలా చూపించిన సీన్, అలానే రష్మిక ఇంకా నటి రోహిణి మధ్య ఓ ఎమోషనల్ సన్నివేశం సినిమాలో సాలిడ్ గా వర్క్ అయ్యింది అని చెప్పవచ్చు. ఈ సినిమా మొత్తంలో ఇది ఫైనెస్ట్ సీక్వెన్స్ అని కూడా చెప్పడంలో సందేహం లేదు.

మైనస్ పాయింట్స్:

ఈ లవ్ స్టోరీ అందరి ప్రేమికులుకి అయితే ఖచ్చితంగా కాదు కేవలం ఓ వర్గం వరకు మాత్రమే సినిమా అందులోని నేపథ్యం కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. రాహుల్ రవీంద్రన్ కథా, కథనాలు కొంతమందికి కనెక్ట్ అవ్వొచ్చు కానీ అదే విధంగా మిగతా వారికి అంతగా రుచించకపోవచ్చు. సో ఈ చిత్రం అందరికీ ఒకేలా కనెక్ట్ అవుతుంది అని చెప్పలేం.

రెండు విభిన్నమైన పాత్రలు భూమా, విక్రమ్ ల ట్రాక్ ఒక మూమెంట్ లో సాగదీతగా అదే చూపించిందే మళ్ళీ మళ్ళీ చూపించి ఎందుకు రిపీట్ చేస్తున్నారు అనిపించక మానదు. ఇలా పలు సన్నివేశాలతో మాత్రం అక్కడక్కడా బాగా సాగదీత ఫీల్ కలుగుతుంది.

ఇక ఒక డీసెంట్ ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ సినిమాలో స్లో అయ్యింది. మూమెంట్స్ నెమ్మదిగా ఊహాజనితంగా మారడంతో క్లైమాక్స్ కూడా ఒకింత సింపుల్ గానే అనిపిస్తుంది. సో వీటిపై మరింత దృష్టి పెట్టాల్సింది.

సంగీత దర్శకుడు హేశం అబ్దుల్ వాహబ్ సంగీతం బానే ఉంది కానీ అది మరీ అంత ఇంపాక్ట్ కలిగించేలా ఉండదు. పాటలు సందర్భానుసారమే అయినప్పటికీ అవి కూడా అంత ఇంపాక్ట్ కలిగించవు. అలాగే అను ఇమ్మానుయేల్ రోల్ కూడా సినిమాలో అంత ప్రాముఖ్యత లేకుండా పోయింది.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బానే ఉన్నాయి. ప్రశాంత్ ఆర్ విహారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ లో బాగా వర్క్ అయ్యింది. కృష్ణన్ వసంత్ కెమెరా వర్క్ బానే ఉంది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది.

ఇక దర్శకుడు రాహుల్ రవీంద్రన్ విషయానికి వస్తే.. తాను దర్శకునిగా సిన్సియర్ అటెంప్ట్ చేసాడు. కానీ కథనం పరంగా మాత్రం ఇంకా కేర్ తీసుకోవాల్సింది. ఎమోషన్స్ పరంగా పలు సన్నివేశాలు స్ట్రాంగ్ ఇంపాక్ట్ కలిగిస్తాయి కానీ కొన్ని సీన్స్ మాత్రం అసహజంగా సాగదీతగా వెళ్తాయి. సో వీటిపై తాను ఇంకా కేర్ తీసుకోవాల్సింది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “ది గర్ల్ ఫ్రెండ్” లో రష్మిక మందన్నా ఒక అద్భుతమైన పెర్ఫామెన్స్ ని ఆమె అందించింది. ఆమెతో పాటుగా దీక్షిత్ శెట్టి కూడా పోటాపోటీగా పెర్ఫామ్ చేసాడు. ఇంకా రావు రమేష్, రోహిణి లాంటి నటులపై సన్నివేశాలు మంచి ప్రభావవంతంగా కూడా ఉన్నాయి కానీ సినిమాలో కోర్ పాయింట్ కొత్తగా ఏమీ అనిపించదు. పైగా దానికి అల్లుకున్న పలు సన్నివేశాలు అందరికీ ఒకేలా కనెక్ట్ అయ్యే అవకాశాలు కూడా తక్కువే ఉంటాయి. వీటితో పాటుగా అక్కడక్కడా స్లో అండ్ రిపీటెడ్ మూమెంట్స్ సినిమాలో రుచించవు. సో వీటితో ఈ చిత్రం అక్కడక్కడా ఆకట్టుకుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

తాజా వార్తలు