ఇప్పుడు మరో సారి పాన్ ఇండియా లెవెల్లో బాహుబలి ఫీవర్ పట్టుకుంది. కొన్నాళ్ల క్రితం వచ్చిన బాహుబలి సినిమాలు ఎలాంటి సంచలన సెట్ చేశాయో అందరికీ తెలిసిందే. అయితే ఈసారి రెండు సినిమాలు కలిపి బాహుబలి ది ఎపిక్ అంటూ రిలీజ్ కి తీసుకురాగా మరోసారి పాన్ ఇండియా లెవెల్లో బాహుబలి పేరు వినిపిస్తుంది.
అయితే హీరోలు ప్రభాస్ రానా దగ్గుబాటి అభిమానులు ఈ రీ రిలీజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఓ స్టార్ హీరో అభిమానులు మాత్రం తీవ్ర నిరాశలో ఉన్నారు. మరి ఆ హీరో ఎవరంటే కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్. ఈ రెండు సినిమాల్లో కలిపి సింగల్ పార్ట్ గా చేసిన నేపథ్యంలో కిచ్చా సుదీప్ కి సంబంధించిన సన్నివేశాలు మొత్తాన్ని తొలగించేశారు.
దీంతో సుదీప్ అభిమానులు బాగా హర్ట్ అయినట్టున్నారు సోషల్ మీడియా వేదికగా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ తమ అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారు.


