“అఖండ 2” ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్ అయ్యిందా?

“అఖండ 2” ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్ అయ్యిందా?

Published on Oct 31, 2025 10:27 AM IST

Akhanda2

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం అఖండ 2 కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో ఒక బ్లాస్టింగ్ ట్రీట్ ని ఇచ్చేందుకు సన్నద్ధం అవుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు.

ఇక సంగీత దర్శకుడు థమన్ కూడా అంతకు మించిన ప్రయోగాలు చేస్తూ థియేటర్స్ లో మాస్ ట్రీట్ ని ప్రామిస్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు అఖండ 2 ఫస్ట్ సింగిల్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. దీని ప్రకారం అఖండ 2 మొదటి సాంగ్ ని మేకర్స్ ఈ నవంబర్ 5న రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి 14 రీల్ ప్లస్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు