పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో తెరకెక్కించిన ఎపిక్ హిస్టారికల్ చిత్రం బాహుబలి సిరీస్ కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాలని రెండింటిని కలిపి ఒక్క సినిమాగా బాహుబలి ది ఎపిక్ అంటూ రీరిలీజ్ కి తీసుకొస్తే దీనికి మళ్లీ పాన్ ఇండియా సహా యూఎస్ మార్కెట్ లో అదిరే రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ సినిమా బుక్ మై షో బుకింగ్స్ లో అదరగొడుతుంది.
ఇన్ని రోజులు ప్రీ సేల్స్ తో పాటుగా నిన్న ఒక్క 30 తారీఖు సేల్స్ లక్ష టికెట్స్ కి పైగా అమ్ముడుపోయాయని తెలుస్తోంది. ఇలా కేవలం ప్రీ సేల్స్ లోనే బాహుబలి ది ఎపిక్ సినిమా 3లక్షలకు పైగా టికెట్ లని సేల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఫుల్ ఫ్లెడ్జ్ రిలీజ్ నేడు కాగా ఈరోజు కూడా హావర్లీ బుకింగ్స్ లో బాహుబలి ట్రెండ్ అవుతుంది. మరి ఫైనల్ రన్ లో బాహుబలి ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.


