తెలుగు సినిమా ఆడియెన్స్ కి ఖైదీ అనే పేరుతో ఉన్న పరిచయం కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ టైటిల్ కి మెగాస్టార్ సినిమాల ట్రాక్ రికార్డులే నిదర్శనం. అయితే మన దగ్గర సెన్సేషనల్ హిట్ ఖైదీ ఉన్నట్టే తమిళ ఆడియెన్స్ కి కూడా ఉన్న న్యూ ఏజ్ ఖైదీనే కార్తీ నటించిన చిత్రం.
ఇలా తన సినిమాకి కూడా సెపరేట్ ట్రాక్ రికార్డ్ సెట్ చేసుకున్న కార్తీ ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో భాగం కానున్నాడా అంటే అవుననే రూమర్స్ వినిపిస్తున్నాయి. దర్శకుడు బాబీతో చేయనున్న సాలిడ్ ప్రాజెక్టులో ఖైదీ హీరోలు కలిసి కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాల్సిందే.


