గీతా సుబ్రమణ్యం ఫేమ్ మనోజ్ కృష్ణ తన్నీరు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎ కప్ ఆఫ్ టీ’. నేటి యువత మనసుకు దగ్గరయ్యే కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి ఎఫ్.పీ. రోజర్స్, నిఖితా రావు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్టిస్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై మనోజ్ కృష్ణ, నవీన్ కృష్ణ నిర్మిస్తున్నారు. జయ శ్రీ కథానాయికగా నటుడు రాకేష్ ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాలోని “వాట్ హ్యాపెన్డ్” అనే ప్రమోషనల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా హీరో మనోజ్ మాట్లాడుతూ.. “చిన్న సినిమాలు పెద్ద సినిమాల వలన ఎలా ప్రభావితం అవుతున్నాయో ఫన్నీగా చూపించాలనే ఉద్దేశంతో ఈ పాట రూపొందించాం. ఈ సాంగ్ ద్వారా మా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఎ కప్ ఆఫ్ టీ ఒక యువకుడి ప్రయాణం, అతని జీవితంలో వచ్చే మలుపులను చూపించే సినిమా. గీతా సుబ్రమణ్యం తర్వాత నాకు ఈ స్థాయి హై ఇచ్చిన ప్రాజెక్ట్ ఇదే. మా టీమ్ అందరం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. మా హీరోయిన్ జయ శ్రీ అద్భుతంగా చేసింది, ఆమె పాత్ర యువతకు నచ్చడం ఖాయం” అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ రోడ్రిగ్స్ మాట్లాడుతూ.. “చిన్న సినిమా అయినా మేకింగ్, మ్యూజిక్ మీద మనోజ్ రాజీ పడలేదు. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వచ్చాయి. దర్శకులు మంచి అవుట్‌పుట్ ఇచ్చారు. ఆదిత్య కూడా మంచి పాత్రలో కనిపిస్తారు. అందరి కష్టంతో సినిమా చాలా బాగుంది” అన్నారు.
సినిమాటోగ్రాఫర్ కమల్ నాబ్ మాట్లాడుతూ..“మనోజ్ ఈ సినిమాకి వన్ మాన్ ఆర్మీలా పనిచేశాడు. యాక్టింగ్‌పై ఆయనకు ఉన్న ప్యాషన్‌తో సినిమా అద్భుతంగా పూర్తిచేశాడు. ఇది ఒక అందమైన లవ్ స్టోరీ, లైఫ్ స్టోరీలా ఉంటుంది. యువత తప్పక కనెక్ట్ అవుతారు” అన్నారు.
నటుడు రాకేష్ మాట్లాడుతూ.. “నేను మనోజ్‌కి పెద్ద ఫ్యాన్. గీతా సుబ్రమణ్యం సమయంలో ఆయనకు ఉన్న క్రేజ్ నాకు తెలుసు. అప్పుడే ఆయన సినిమా చేస్తే ఒక పాత్ర ఇవ్వమని చెప్పాను. ఈ కథలో ఎలాంటి వల్గారిటీ లేకుండా ఒక మంచి సందేశం ఉంది. ఈ అవకాశానికి మనోజ్‌కి ధన్యవాదాలు. సినిమా పెద్ద హిట్ అవ్వాలి, హీరోగా మనోజ్ బిజీ కావాలి” అన్నారు.


