సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియిస్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్‌తో ప్రేక్షకును థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
కాగా, అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సెషన్స్ షురూ అయినట్లు మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి తనయుడు కాల భైరవ తెలిపారు. తాజాగా జరిగిన ‘మోగ్లీ’ చిత్ర సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన ఈ విషయాన్ని తెలిపారు.
తన తండ్రి ప్రతి మ్యూజిక్ సెషన్‌లో తనకు ఏదో ఒక పని అప్పజెప్పుతారని.. అదే విధంగా మహేష్-రాజమౌళి చిత్రంలో కూడా తనను ఇన్వాల్వ్ చేశారని కాలభైరవ తెలిపాడు. ఇక ఈ విషయంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమా మ్యూజిక్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని ఆసక్తిగా చూస్తున్నారు.


