ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన విజయ్ ఆంటోని ‘భద్రకాళి’

ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన విజయ్ ఆంటోని ‘భద్రకాళి’

Published on Oct 24, 2025 9:01 AM IST

Bhadrakaali Movie

తమిళ నటుడు విజయ్ ఆంటోని తన కెరీర్‌లో 25వ చిత్రంగా రూపొందించిన ‘శక్తి తిరుమగన్’ చిత్రాన్ని తెలుగులో ‘భద్రకాళి’ పేరుతో రిలీజ్ చేశారు. ఈ
సినిమా బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ స్పందన తెచ్చుకుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాలో విజయ్ ఆంటోని తన నటనతో మెప్పించాడు.

ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో
స్ట్రీమింగ్ అవుతుంది. అరుణ్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృపాలని, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర తదితరులు కీలక
పాత్రల్లో నటించారు.

ఈ సినిమాను విజయ్ ఆంటోని ప్రొడ్యూస్ చేయడంతో పాటు ఈ చిత్రానికి సంగీతం కూడా అందించాడు. మరి ఈ సినిమాకు ఓటీటీ ఆడియెన్స్ ఎలాంటి రెస్పాన్స్
అందిస్తారో చూడాలి.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు