టాలీవుడ్ స్థాయిని అంతర్జాతీయంగా తీసుకెళ్లిన సినిమా ‘బాహుబలి’. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇక దాని సీక్వెల్ మూవీ ‘బాహుబలి 2’ కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే, ఇప్పుడు ఈ రెండు సినిమాలను కలిపి ‘బాహుబలి ది ఎపిక్’ చిత్రంగా మనముందుకు తీసుకురానున్నారు మేకర్స్.
దీంతో ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తు్న్నారు. కాగా, ఈ కొత్త వెర్షన్ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను అక్టోబర్ 24న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ ట్రైలర్ కట్‌ను రాజమౌళి ఏ విధంగా తీర్చిదిద్దాడా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.
ఈ సినిమాను అక్టోబర్ 31న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు నటించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు.