ఫోటో మూమెంట్ : దీపావళి తళుకులలో చిరంజీవితో పాటు మెరిసిన తారలు

ఫోటో మూమెంట్ : దీపావళి తళుకులలో చిరంజీవితో పాటు మెరిసిన తారలు

Published on Oct 20, 2025 8:01 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు సృష్టిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి 2026 సందర్భంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.

అయితే, తాజాగా దీపావళి పండుగ వేళ మెగాస్టార్ చిరంజీవి తన తోటి సినిమా తారలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాల్లో విక్టరీ వెంకటేశ్, కింగ్ నాగార్జున, అలాగే సహనటి నయనతారతో కలిసి దీపావళిని జరుపుకున్నారు. ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. “ఇలాంటి క్షణాలు మన హృదయాన్ని ఆనందంతో నింపుతాయి. జీవితాన్ని వెలిగించే ప్రేమ, నవ్వులు, ఐక్యతను గుర్తు చేస్తాయి.” అంటూ చిరు కామెంట్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

తాజా వార్తలు