రవితేజ బయోపిక్ ప్లాన్ చేసిన హీరో..!

రవితేజ బయోపిక్ ప్లాన్ చేసిన హీరో..!

Published on Oct 12, 2025 3:00 AM IST

Siddhu-Jonnalagadda-Ravitej

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘తెలుసు కదా’ దీపావళి కానుకగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా సిద్ధు జొన్నలగడ్డ మాస్ రాజా రవితేజతో ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో సిద్ధు జొన్నలగడ్డ పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.

సినిమాలపై చర్చగా మొదలైన ఈ సంభాషణ, చివరికి బయోపిక్స్‌పై ఆసక్తికరమైన చర్చగా మారింది. ఈ సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ ‘కృష్ణ అండ్ హిస్ లీలా’ విడుదలైన తర్వాత, తాను రవితేజపై ఒక బయోపిక్ చేయాలని అనుకున్నట్లు తెలిపాడు. దానికోసం దాదాపు రెండు నెలలు పని చేశాడని సిద్ధు అన్నాడు. ఈ వ్యాఖ్యతో మాస్ రవితేజ ఆశ్చర్యపోయాడు.

దీనిపై స్పందించిన రవితేజ తానూ ఒక నటుడిపై బయోపిక్ చేయాలనే ఆలోచనలో ఉన్నానని కానీ వివరాలను ఇప్పుడు వెల్లడించలేనని చెప్పారు. ఇలా ఇద్దరు హీరోలు బయోపిక్ చిత్రాలపై మాట్లాడటం అభిమానుల్లో ఆసక్తిని క్రియేట్ చేసింది.

తాజా వార్తలు