పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను రంజింపజేశాయి. అయితే, ఇప్పుడు ఆయన తన నెక్స్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ పై ఫోకస్ పెట్టాడు.
దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ చిత్ర నిర్మాత రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం, పవన్ కళ్యాణ్ తన భాగం షూట్ పూర్తిచేశారు. రేపటి(అక్టోబర్ 11) నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ షెడ్యూల్ 20 నుంచి 25 రోజుల్లో ముగించి, వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెడతామని చెప్పారు.
ఇక ఈ సినిమాలో రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లు నటిస్తుండగా రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.