స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘తెలుసు కదా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. ఇక ఈ సినిమాలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండటంతో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది.
దీనికి తోడు ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అయితే, ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ ట్రైలర్ రిలీజ్ అనౌన్స్‌మెంట్‌ను తాజాగా ఓ ప్రోమో ద్వారా వెల్లడించారు. ఈ ప్రోమోలో సిద్ధు చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తోంది.
ఇక ఈ చిత్ర ట్రైలర్‌ను అక్టోబర్ 12న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 17న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి