‘డ్యూడ్’ టాప్‌గేర్‌కు టైమ్ ఫిక్స్..!

‘డ్యూడ్’ టాప్‌గేర్‌కు టైమ్ ఫిక్స్..!

Published on Oct 8, 2025 5:58 PM IST

తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డ్యూడ్’ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు కార్తీశ్వరన్ డైరెక్ట్ చేస్తుండగా ఈ మూవీ దీపావళి కానుకగా గ్రాండ్ రిలీజ్ కానుంది.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. డ్యూడ్ మూవీ నుంచి రానున్న ఈ టాప్‌గేర్‌ను అక్టోబర్ 9న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఈ సినిమాతో ప్రదీప్ రంగనాథన్ మరోసారి తనదైన మార్క్ వేసుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తుండగా అక్టోబర్ 17న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది.

తాజా వార్తలు