‘మాస్ జాతర’ నెక్స్ట్ సాంగ్ రెడీ.. ప్రోమోకి డేట్ ఫిక్స్!

‘మాస్ జాతర’ నెక్స్ట్ సాంగ్ రెడీ.. ప్రోమోకి డేట్ ఫిక్స్!

Published on Oct 5, 2025 5:04 PM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు భాను బోగవరపు తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “మాస్ జాతర”. మంచి బజ్ లోనే ఉన్న ఈ సినిమా కోసం అభిమానులు చాలా కాలం నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఫైనల్ గా ఈ అక్టోబర్ లో రిలీజ్ కి వస్తున్న ఈ సినిమా నుంచి నెక్స్ట్ సాంగ్ కి రంగం సిద్ధం అయ్యింది.

ఇది వరకే వచ్చిన రెండు పాటలు మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి. ఇక మూడో సాంగ్ గా హుడియో హుడియో అంటూ సాగే పాటని శ్రీలీల, రవితేజ మాస్ నెంబర్ గా ఇపుడు అనౌన్స్ చేసారు. ఇక ఈ సాంగ్ తాలూకా ప్రోమో రేపు అక్టోబర్ 6న ఉదయం 11 గంటల 8 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. సంగీత దర్శకుడు భీమ్స్ ఈసారి ఎలాంటి ట్యూన్ ని అందించాడో చూడాలి మరి. ఇక ఈ సినిమా థియేటర్స్ లో ఈ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుంది.

తాజా వార్తలు