స్లోగా ఎక్కేస్తున్న ‘మీసాల పిల్ల’..!

స్లోగా ఎక్కేస్తున్న ‘మీసాల పిల్ల’..!

Published on Oct 5, 2025 2:00 AM IST

Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు” కోసం అందరికీ తెలిసిందే. మంచి అంచనాలు ఉన్న ఈ సాలిడ్ ఎంటర్టైనర్ నుంచి రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల తాలూకా ప్రోమో వచ్చిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. మరి దానికి పాజిటివ్ రెస్పాన్స్ తో పాటుగా కొంతమంది నుంచి నెగిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది.

కానీ అల్టిమేట్ గా అనీల్ రావిపూడి అనుకున్నదే జరుగుతుంది అని చెప్పాలి. గతంలో సంక్రాంతికి వస్తున్నాం కి జరిగినట్టు గానే సాంగ్ బ్యాక్గ్రౌండ్ విజువల్స్ లాంటి వాటితో సంబంధం లేకుండా ఈ చిన్న ప్రోమో సోషల్ మీడియాలో సహా ఆఫ్ లైన్ లో సాలిడ్ రీచ్ అందుకుంది. రీల్స్ లో కూడా హంగామా మొదలు కాగా మెగాస్టార్ వేసిన స్టెప్పులు ఆల్రెడీ చాలామంది అనుకరిస్తున్నారు. సో అల్టిమేట్ గా మీసాల పిల్ల మాత్రం అందరిలో స్లోగా ఎక్కేస్తుంది అని చెప్పవచ్చు.

తాజా వార్తలు