మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ నుంచి వచ్చిన మూడు సినిమాలు కూడా టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇలా ఓజి సినిమా సక్సెస్ తర్వాత తాను వెంటనే నాచురల్ స్టార్ నాని ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అయ్యాడు. అయితే ఈ చిత్రంపై కూడా మంచి బజ్ నెలకొనగా ఈ ప్రాజెక్ట్ పై కూడా ఓ క్రేజీ టాక్ అయితే వైరల్ గా వినిపిస్తుంది.
లేటెస్ట్ గా సుజీత్ పవర్ స్టార్ ని రెబల్ స్టార్ ని తన సినిమాటిక్ యూనివర్స్ తో లింక్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ లింక్ లోనే బ్లడీ రోమియో కూడా ఉంటాడని ఇంట్రస్టింగ్ రూమర్స్ ఇపుడు వినిపిస్తున్నాయి. మరి ఇది కూడా నిజం అయితే మాత్రం మన తెలుగు సినిమా నుంచి ఒక సాలిడ్ సినిమాటిక్ యూనివర్స్ ఉన్నట్టే అని చెప్పాలి. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుంది అనేది కాలమే నిర్ణయించాలి.