OG : ఎట్టకేలకు నేహా శెట్టి సాంగ్ వచ్చేసింది..!

OG : ఎట్టకేలకు నేహా శెట్టి సాంగ్ వచ్చేసింది..!

Published on Sep 30, 2025 10:06 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓజీ’ పాజిటివ్ రెస్పాన్స్‌తో బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా దూసుకుపోతుంది. ఈ సినిమాలో పవన్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని.. అందులో యంగ్ బ్యూటీ నేహా శెట్టి డ్యాన్స్ చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, సినిమా రిలీజ్ తర్వాత చూస్తే అందులో ఆ సాంగ్ లేదు.

దీంతో నేహా శెట్టితో పాటు అభిమానులు కూడా నిరాశకు గురయ్యారు. అయితే, ఇప్పుడు ఈ స్పెషల్ సాంగ్‌ను సినిమాలో యాడ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ‘కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్’ అంటూ సాగే ఈ పాటను నేటి సాయంత్రం షోస్ నుండి యాడ్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇక ఈ సాంగ్ యాడ్ కావడంతో ఈ పాట సినిమాలో ఎప్పుడు వస్తుందా.. అది ఎలా ఉంటుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో నటించాడు.

తాజా వార్తలు