‘ఓజి 2’ అనౌన్స్ చేసిన పవర్ స్టార్!

‘ఓజి 2’ అనౌన్స్ చేసిన పవర్ స్టార్!

Published on Sep 30, 2025 6:58 PM IST

OG Movie Review

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “ఓజి”. సాలిడ్ బజ్ నడుమ రిలీజ్ అయ్యిన ఈ సినిమా అదే రేంజ్ ఓపెనింగ్స్ ఇంకా సాలిడ్ వీకెండ్ ని చూసింది. ఇక లేటెస్ట్ గా మెగా ఫ్యామిలీ హీరోస్ అంతా కలిసి ఓజి స్పెషల్ స్క్రీనింగ్ చూసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ స్క్రీనింగ్ లో ఓజి సినిమా పూర్తయ్యాక మెగాస్టార్ సహా ఇతర చిత్ర యూనిట్ మొత్తం ముందు కూడా పవర్ స్టార్ ఓజి పార్ట్ 2 చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసినట్టు మెగా సన్నిహిత వర్గాలు ఇపుడు చెబుతున్నాయి. అలాగే నిన్న స్క్రీనింగ్ తర్వాత పవన్ కొంతసేపు స్పీచ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ స్పీచ్ కోసం పక్కన పెడితే మాత్రం తానే ఓజి 2 కోసం కూడా చెప్పడం అనేది చిత్ర యూనిట్ కి మరింత కిక్ ఇచ్చింది. ఇక ఈ సినిమా ఎప్పుడు నుంచి మొదలు పెడతారో చూడాలి మరి.

తాజా వార్తలు