నార్త్ లో ‘కాంతార 1’ కి ఇంత ఓపెనింగ్స్ గ్యారెంటీనా?

నార్త్ లో ‘కాంతార 1’ కి ఇంత ఓపెనింగ్స్ గ్యారెంటీనా?

Published on Sep 30, 2025 6:00 PM IST

Kantara-Chapter-1

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో అవైటెడ్ గా ఉన్న పలు చిత్రాల్లో కన్నడ సెన్సేషనల్ చిత్రం కాంతార ప్రీక్వెల్ కూడా ఒకటి అని చెప్పాలి. దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమా ఈ దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. అయితే హిందీలో గత చిత్రం వండర్స్ సెట్ చేసింది.

దీనితో ఈసారి సినిమా కూడా అంతకు మించే పెర్ఫామ్ చేస్తుందని మొదట్లో చాలా మంది అనుకున్నారు కానీ మరీ అంత రేంజ్ లో కాకపోయినా కాంతార 1 కి నార్త్ బెల్ట్ లో డీసెంట్ ఓపెనింగ్స్ గ్యారెంటీ అన్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

నార్త్ బెల్ట్ లో ఈ సినిమాకి మినిమమ్ 20 కోట్ల నెట్ వసూళ్లు ఓపెనింగ్స్ గా వచ్చే ఛాన్స్ ప్రస్తుతం కొనసాగుతున్న బుకింగ్స్ మూమెంటం చూస్తుంటే కనిపిస్తుందట. ఈ రెండు రోజుల్లో ఇంకా పెరిగితే లెక్క కూడా ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉందని వినిపిస్తుంది. మరి ఈ సినిమాకి ఏ రేంజ్ ఓపెనింగ్స్ అక్కడ నుంచి వస్తాయో చూడాలి మరి.

తాజా వార్తలు