సమీక్ష: ‘ఇడ్లీ కొట్టు’ – స్లోగా సాగే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా

సమీక్ష: ‘ఇడ్లీ కొట్టు’ – స్లోగా సాగే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా

Published on Oct 1, 2025 5:45 PM IST

Idli-Kottu Movie

విడుదల తేదీ : అక్టోబర్ 1, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : ధనుష్, నిత్యా మీనన్, రాజ్ కిరణ్ అరుణ్ విజయ్, షాలిని పాండే, సముద్రఖని, సత్యరాజ్
దర్శకుడు : ధనుష్
నిర్మాతలు : ఆకాష్ బాస్కరన్, ధనుష్
సంగీత దర్శకుడు :  G. V. ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రాఫర్ : కిరణ్ కౌశిక్
ఎడిటర్ : ప్రసన్న జికె

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో ధనుష్ హీరోగా తన దర్శకత్వంలోనే తెరకెక్కించిన చిత్రం “ఇడ్లీ కొట్టు” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఓ చిన్న గ్రామం శంకరాపురం అనే ఊర్లో చిన్న ఇడ్లీ కొట్టుతో జీవితాన్ని ఆదాయం అంటే ఆస్వాదంలోనే బాగుంటుందని నమ్మే వ్యక్తి శివ కేశవుడు (రాజ్ కిరణ్). పైగా తన చేతి ఇడ్లీ రుచి అంటే చుట్టు పక్కల కూడా ఎంతో మంచి పేరు. అలాంటి వ్యక్తి కొడుకు మురళీ (ధనుష్) గొప్ప కలలు కని జీవితంలో గొప్పగా ఎదగాలి అనుకుంటాడు. అలా బ్యాంకాక్ లో పేరు మోసిన ఫుడ్ బిజినెస్ మెన్ విష్ణు వర్ధన్ (సత్యరాజ్) బిజినెస్ డెవలప్ అవ్వడంలో చాలా కీలక పాత్ర పోషిస్తాడు. అలా తన కూతురు మీరా (షాలిని పాండే) తో పెళ్లి కూడా కుదుర్చుకుంటాడు. ఇలా ఇంటికి దూరంగా ఏదో వెలితితోనే అక్కడ ఉంటాడు. ఈ సమయంలో మురళీ జీవితంలో రెండు తీరని విషాదాలు చోటు చేసుకుంటాయి. ఈ టర్న్ తన జీవితాన్ని మళ్లీ తన ఊరికి వచ్చేలా చేస్తుంది. ఇక్కడ నుంచి తన ఇడ్లీ కొట్టు మళ్లీ ఎలా ఆరంభించాడు? ఈ క్రమంలో కల్యాణి (నిత్యా మీనన్) ఎలా ఉపయోగపడుతుంది. విష్ణు వర్ధన్ కొడుకు అశ్విన్ (అరుణ్ విజయ్) కి మురళీ అంటే ఎందుకు నచ్చదు. తనని నాశనం చేసేందుకు అతనేం చేసాడు? చివరికి మురళీ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఈ సినిమాతో ధనుష్ ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

మొట్టమొదటిగా ఈ సినిమాకి ప్రధాన బలం ఒకే ఒక్కడు ధనుష్ అని చెప్పి తీరాలి. తను ఎంచుకున్న సింపుల్ కథ చుట్టూతా తను అల్లుకున్న కథనం ఈ సినిమాని ఎంతో రంజింపజేస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఎమోషనల్ పార్ట్ చాలా బాగుంది. మొదటి సగంలో ధనుష్ డిజైన్ చేసుకున్న ప్రతీ ఎపిసోడ్, వాటి తాలూకా భావోద్వేగాలు నేరుగా ఆడియెన్స్ హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి.

అందులోని మంచి డైలాగ్స్, జీవిత చక్రంలో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం ఆడియెన్స్ కి ఎలాంటి సినిమా కావాలో ఆ తరహా గుడ్ ఎమోషన్స్ తో తను ఈ సినిమా నడిపించడంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఈ ప్రయాణంలో ధనుష్ ప్రతీ ఒక్కరు పాత్రని కూడ ఎక్కడా తగ్గించకుండా సమ పాళ్లలో డిజైన్ చేసుకోవడం అనేది మరో మంచి విషయం అని చెప్పాలి. తిరు సినిమా తర్వాత ధనుష్, నిత్యా మీనన్ ల జంట, వారి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. ఒక పల్లెటూరు అమ్మాయిగా నిత్యా మీనన్ చాలా బాగా చేసింది.

మరో హీరోయిన్ షాలిని పాండే కూడా తన రోల్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి బాగా చేసింది. ఇక బిజినెస్ మెన్ గా సత్యరాజ్ మంచి లుక్స్ అండ్ పెర్ఫామెన్స్ లతో ఆకట్టుకున్నారు. ఇక అరుణ్ విజయ్ కూడా తన రోల్ ని బాగా చేసాడు. ఇక వీరితో పాటుగా ధనుష్ డిజైన్ చేసుకున్న బ్యూటిఫుల్ పాత్ర తన నాన్న శివ కేశవుడు రోల్ అని చెప్పాలి. రాజ్ కిరణ్ నటించిన ఈ రోల్ సాలిడ్ గా వర్కవుట్ అయ్యింది అని చెప్పాలి. తనపై సాగే సన్నివేశాలు, ఎమోషన్స్, డైలాగ్ సినిమాలో ఎంతో హృద్యంగా అనిపిస్తాయి.

ఇక వీటితో పాటుగా ధనుష్ అందించాలి అనుకున్న సందేశం కూడా నీట్ గా ఉంది. పుట్టిన ఊరు, తల్లిదండ్రులు విషయంలో తను డిజైన్ చేసుకున్న సన్నివేశాలు కానీ మాటలు కానీ ఖచ్చితంగా ప్రతీ మిడిల్ క్లాస్ కుటుంబాలకు టచ్ అయ్యే విధంగా ఉంటాయి. వీటితో పాటుగా సముద్రకని రోల్ సినిమాలో మంచి ఇంప్రెసివ్ గా ఉంది. అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి.

వీరితో పాటుగా ఇలవరసు, పార్థిబన్ తదితరులు తమ రోల్స్ కి న్యాయం చేకూర్చారు. ఇక ఫైనల్ గా ధనుష్ కోసం ఎప్పటిలానే నటన అదరగొట్టాడు. ప్రతీ సినిమా సినిమాకు అన్ని వేరియేషన్స్ కి ఎలా తను సమయాన్ని కుదుర్చుకుంటున్నారో కానీ సినిమా పట్ల తన అంకిత భావాన్ని మాత్రం మెచ్చుకొని తీరాలి. తన పాత్రలోని లేయర్స్ ని తాను డిజైన్ చేసుకున్న తీరు అందులో తన నటన, మంచి మాస్ మూమెంట్స్ లాంటివి తన నుంచి ఆడియెన్స్ ఏం ఆశిస్తారో వాటిని ఫుల్ ఫిల్ చేసే విధంగా ఉంటాయి.

మైనస్ పాయింట్స్:

ఒక బలమైన ఫస్టాఫ్ తర్వాత ఆ ఎమోషనల్ ఫ్లో సెకండాఫ్ లో కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తుంది. సెకాండఫ్ మొదలైన ఒక 20, 30 నిమిషాల కథనం తెలుగు ఆడియెన్స్ కి అంత కనెక్ట్ కాకపోవచ్చు.

తమిళ నేటివిటీ అక్కడి కొన్ని నమ్మకాలు వాటిపై చూపే సన్నివేశాలు కొంచెం డ్రమాటిక్ గా అనిపించే అవకాశం ఉంది. అలాగే అరుణ్ విజయ్ రోల్ పై సన్నివేశాలు కొంచెం రొటీన్ ఫీల్ ఇస్తాయి. తనకి సత్యరాజ్ పై సన్నివేశాలు చూస్తే ఇదే ధనుష్ రఘువరన్ బీ టెక్ లో విలన్ తండ్రీ కొడుకులు ఫార్మాట్ లో అనిపిస్తుంది. దీనితో ఆ కొన్ని సన్నివేశాలు కొంచెం రొటీన్ గానే అనిపిస్తాయి.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. మేకర్స్ రెండు లేయర్స్ ప్రపంచాలని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. కిరణ్ కౌశిక్ ఇచ్చిన కెమెరా వర్క్ బాగుంది. సిటీ ఇంకా పల్లెటూరి దృశ్యాలు చక్కగా బంధించారు. ఎడిటింగ్ డీసెంట్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. మాటల తర్జుమా, తెలుగు ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా బలమైన డైలాగ్స్ ఇందులో ఉన్నాయి. దర్శకునిగా ధనుష్ నుంచి గత రాయన్ కంటే ఇది చాలా బెటర్ వర్క్ అని చెప్పవచ్చు. కొన్ని అంశాలు పక్కన పెడితే ఎమోషనల్ గా ధనుష్ చెప్పాలనుకున్న సందేశం ఆడియెన్స్ కి చేరేలా చేయడంలో తను సక్సెస్ అయ్యారు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘ఇడ్లీ కొట్టు’ స్లోగా ఉన్నా ఒక డీసెంట్ గా సాగే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పవచ్చు. హీరోగానే కాకుండా తను దర్శకునిగా కూడా ధనుష్ మంచి వర్క్ ఈ చిత్రానికి అందించాడు. తను డిజైన్ చేసుకున్న ఎమోషనల్ మూమెంట్స్ ఆడియెన్స్ కి హత్తుకునేలా ఉంటాయి. అలాగే నటీనటులు అంతా కూడా మంచి పెర్ఫామెన్స్ లు అందించారు. కానీ ఫస్టాఫ్ లో మైంటైన్ చేసిన ఎమోషనల్ ఫ్లో సెకాండఫ్ లో మిస్ అయ్యింది. అలాగే కొన్ని సీన్స్ కొంచెం డ్రమాటిక్ గా అనిపిస్తాయి. ఇవి పక్కన పెట్టి ఎలాంటి అంచనాలు లేకుండా మంచి ఎమోషనల్ ఫ్యామిలీ సినిమా కుటుంబంతో చూడాలి అనుకునే వారు ఈ దసరా వారాంతంలో ఈ చిత్రాన్ని చూడొచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

తాజా వార్తలు