దేవర 2 రిలీజ్‌పై అభిమానుల ఆసక్తి.. ఎప్పుడొస్తుందో..?

దేవర 2 రిలీజ్‌పై అభిమానుల ఆసక్తి.. ఎప్పుడొస్తుందో..?

Published on Sep 28, 2025 1:00 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘దేవర’ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. అయితే నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ ‘దేవర 2’ త్వరలో ప్రారంభమవుతుందనే క్లూ ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సీక్వెల్ ఉండదనే లీకులు వచ్చినా, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దేవర సీక్వెల్ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఇప్పుడు స్పష్టమైంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్, నెల్సన్ దిలీప్ కుమార్ ప్రాజెక్టులు ఉన్నా, వీరిద్దరి కంటే కొరటాల శివకే సమయం ఎక్కువగా ఉన్నందున దేవర 2 వెంటనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశముందని టాక్. ఈ లెక్కన ఎన్టీఆర్-కొరటాల ‘దేవర 2’ 2027 ఫస్ట్ హాఫ్‌లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని సినీ సర్కిల్స్ టాక్.

ఇప్పటికే స్క్రిప్ట్, ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. సెట్ రెడీ గా ఉండటంతో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్ డేట్స్ ఫైనల్ చేస్తే షూటింగ్ మొదలవచ్చు. మొదటి భాగంలో వచ్చిన విమర్శలు మళ్లీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.

తాజా వార్తలు