‘తెలుగు కదా’ కోసం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బ్యూటీ

‘తెలుగు కదా’ కోసం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బ్యూటీ

Published on Sep 21, 2025 7:04 PM IST

telusu kada

మన టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా దర్శకురాలు నీరజ కోన తెరకెక్కించిన మొదటి చిత్రమే “తెలుసు కదా”. ఒక ఇంట్రెస్టింగ్ రోమ్ కామ్ డ్రామా తెరకెక్కించిన ఈ సినిమా నుంచి ఒకో సాంగ్ ఇపుడు వస్తుంది. అయితే ఈ సాంగ్స్ లో రెండో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేసేందుకు సిద్ధం చేశారు.

మరి ఈ సాంగ్ ని సెప్టెంబర్ 23న ఉదయం 11 గంటల 7 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేయగా ఈ సాంగ్ కోసం మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఒకటి ‘మన శంకర వరప్రసాద్ గారు’ బ్యూటీ నయనతార చేతులు మీదుగా రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ సినిమాకి సంగీతం థమన్ అందిస్తుండగా ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ అక్టోబర్ 17న థియేటర్లులో సినిమా రిలీజ్ కాబోతుంది.

తాజా వార్తలు