‘ఓజి’: ఒకే రోజు డబుల్ బ్లాస్ట్.. ఈవెంట్ వేదిక ఖరారు!

‘ఓజి’: ఒకే రోజు డబుల్ బ్లాస్ట్.. ఈవెంట్ వేదిక ఖరారు!

Published on Sep 20, 2025 4:13 PM IST

og

ఇంకొన్ని రోజుల్లో బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు వస్తున్న అవైటెడ్ చిత్రమే “ఓజి”. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలయికలో తెరకెక్కించిన ఈ సినిమా కోసం ఎగ్జైటెడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ సినిమా సమయం దగ్గరకి వస్తుంది కానీ అప్డేట్స్ పరంగా క్లారిటీ లేక అభిమానులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు.

ఇలానే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై కూడా సర్ప్రైజింగ్ గానే అప్డేట్ వచ్చింది. ఎక్కడెక్కడో ప్రీ రిలీజ్ లు అనుకుంటే ఫైనల్ గా హైదరాబాద్ లో రేపు సెప్టెంబర్ 21న చేస్తున్నట్టుగా ఖరారు చేశారు. ఇక రేపు ఉదయం ట్రైలర్ వస్తే సాయంత్రం నుంచి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఎల్బీ స్టేడియం లో చేస్తున్నట్టుగా ఖరారు చేశారు. ఇలా ఉదయం ట్రైలర్, సాయంత్రం గ్రాండ్ ఈవెంట్ తో మోత మోగి ఫ్యాన్స్ కి డబుల్ బ్లాస్ట్ అని చెప్పాలి.

తాజా వార్తలు