ఫోటో మూమెంట్: దహాతో సంచలన దర్శకుడు!

ఫోటో మూమెంట్: దహాతో సంచలన దర్శకుడు!

Published on Sep 20, 2025 2:30 PM IST

RGV-amir-khan

బాలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి బిగ్గెస్ట్ స్టార్స్ లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కూడా ఒకరు. రీసెంట్ గానే సితారే జమీన్ పర్ అలాగే కూలీ చిత్రాలతో అలరించిన తాను నెక్స్ట్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాల కోసం పక్కన పెడితే అమీర్ ఖాన్ కెరీర్ లో చేసిన ఎన్నో ఐకానిక్ హిట్ చిత్రాల్లో ఒకటైన రంగీలా చిత్రం ఇపుడు రీరిలీజ్ కి వచ్చింది.

దీనితో ఈ చిత్రం దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలిసి కనిపించడం వైరల్ గా మారింది. మరి తన రంగీలా తో అంటూ సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అమీర్ ఖాన్ తో కలిసి దిగిన పిక్ ఇపుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. దీనితో ఈ సినిమా ఫ్యాన్స్ వీరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అమీర్ ఖాన్ నెక్స్ట్ సినిమాలుగా హీరోగానే కాకుండా పలు సినిమాలు నిర్మాతగా కూడా చేయనున్నారు.

తాజా వార్తలు