కన్నడ స్టార్ యశ్ ‘కేజీయఫ్’, ‘కేజీయఫ్ 2’ చిత్రాలతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ఆ సినిమాలు ఇచ్చిన క్రేజ్‌తో ఆయన ప్రస్తుతం పలు ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. ఆయన నుంచి రాబోతున్న నెక్స్ట్ చిత్రం ‘టాక్సిక్’. లేడీ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ ఈ చిత్రాన్ని ప్రెస్టీజియస్‌గా రూపొందిస్తున్నారు.
ఇక ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ వినిపిస్తుంది. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ త్వరలో జరుపుకోనుందని.. ముంబైలో ఈ షెడ్యూల్ 45 రోజుల పాటు సాగనుందని తెలుస్తోంది.
ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట. వాటితో పాటు పలు యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉంటాయట. ఈ సినిమాను కన్నడతో పాటు ఇంగ్లీష్‌లో చిత్రీకరిస్తున్నారు మేకర్స్. నయనతార, కియారా అద్వానీ, తార సుతారియా తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను 2026 మార్చి 19న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.