OG : నైజాంలోనూ టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్..!

OG : నైజాంలోనూ టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్..!

Published on Sep 19, 2025 9:08 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఓజి’ చిత్రం సెప్టెంబర్ 25న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు సుజీత్ డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా టికెట్ రేట్ల విషయంలో తెలుగు రాష్ట్రాల్లో ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఓజి టికెట్ రేట్ల పెంపుకు అనుమతినిస్తూ జీవో జారీ చేసింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఓజి చిత్ర టికెట్ రేట్లు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నైజాంలో ఈ చిత్ర టికెట్ రేట్లు సింగిల్ స్క్రీన్స్‌కు రూ.100/-, మల్టీప్లెక్స్‌లకు రూ.150/- చొప్పున పెంచుకునేందుకు రేవంత్ సర్కార్ ఓకే చెప్పింది. ఇక 24వ తేదీన రాత్రి 9 గంటలకు రూ.800/- టికెట్ రేట్‌తో స్పెషల్ ప్రీమియర్ ప్రదర్శనకు కూడా ఓకే చెప్పింది.

దీంతో తెలంగాణలో ఓజి చిత్రానికి టికెట్ రేట్ల విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమాను తొలిరోజే చూసేందుకు ప్రేక్షకులు రెడీ అవుతున్నారు. ఇమ్రాన్ హష్మి, ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు