ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన బ్లాక్ బస్టర్ “మహావతార్ నరసింహ”

ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన బ్లాక్ బస్టర్ “మహావతార్ నరసింహ”

Published on Sep 19, 2025 12:40 PM IST

mahavatar narasimha

ఇండియన్ సినిమా ఈ ఏడాదిలో డెలివర్ చేసిన పలు హిస్టారికల్ సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో “మహావతార్ నరసింహ” కూడా ఒకటి. దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన ఈ యానిమేషన్ చిత్రాలు ఎలాంటి పాన్ ఇండియా స్టార్స్ ప్రెజెన్స్ లేకపోయినప్పటికీ సాలిడ్ ఎమోషన్స్ సహా గ్రాండ్ విజువల్స్ తో వచ్చి ఫ్యామిలీ ఆడియెన్స్ ని థియేటర్స్ కి రప్పించింది. ఇలా భారీ మొత్తం 300 కోట్లకి పైగా వసూళ్లు సొంతం చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకి ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

మరి ఈ సినిమాని దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టుగా నిన్ననే ఒక సర్ప్రైజ్ అనౌన్సమెంట్ చేయగా నేటి నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో తెలుగు సహా ఇతర పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. మరి ఓటిటిలో ఈ చిత్రం ఎలాంటి సంచలనం సెట్ చేస్తుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి సామ్ సి ఎస్ ఒక అద్భుతమైన మ్యూజిక్ ఆల్బమ్ ని అందించగా క్లీం ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు