వరుస చిత్రాలతో ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నిరంతరం పని చేస్తున్నారు. హీరోగా వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌తో శ్రీకాంత్ రాజారత్నం నిర్మాతగా జైరామ్ చిటికెల తెరకెక్కిస్తున్న చిత్రం ‘కాయిన్’. చంద్రహాస్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 17) సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్, టైటిల్ పోస్టర్‌ను బుధవారం నాడు రిలీజ్ చేశారు.
ఈ సందర్బంగా దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ.. ‘‘కాయిన్’ సినిమాతో ఇండస్ట్రీలోకి కొత్త టాలెంట్ రావాలని కోరుకుంటున్నాను. ప్రభాకర్ గారితో నాకు చాలా ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. చంద్రహాస్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ‘కాయిన్’ చుట్టూ ఇంత జరిగిందా? అని కథ చెప్పినప్పుడు షాక్ అయ్యా. ట్రైలర్ వచ్చిన తరువాత చిత్రంపై మరింత అంచనాలు పెరుగుతాయని నమ్మకంగా ఉన్నాను. టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మాట్లాడుతూ.. ‘యథార్థ సంఘటనల ఆధారంగా మా దర్శకుడు జైరామ్ ఈ ‘కాయిన్’ మూవీని తీస్తున్నారు. పాత ఐదు రూపాయల కాయిన్స్‌ని బ్యాన్ చేయడం, ఆ కాయిన్స్ మెల్ట్ చేయడం, వాటి నేపథ్యంలో క్రైమ్ అనే పాయింట్లతో అద్భుతంగా కథను రాసుకున్నారు. జైరామ్ పనితనం నాకు చాలా నచ్చింది. జైరామ్ భవిష్యత్తులో స్టార్ డైరెక్టర్ అవుతారు. ‘కాయిన్’ ఫస్ట్ ఫ్లిప్‌ను లాంచ్ చేసేందుకు వచ్చిన సాయి రాజేష్ అన్నకి థాంక్స్. నిమిషి మ్యూజిక్ డైరెక్టర్‌గా పెద్ద స్థాయికి వెళ్తారు. శ్రీకాంత్ రాజా రత్నం ఎంతో ప్యాషన్ ఉన్న నిర్మాత. ఆయనకు కథపై చాలా నమ్మకం ఉంది.’ అని అన్నారు.
దర్శకుడు జైరామ్ చిటికెల మాట్లాడుతూ.. ‘5 రూపాయల కాయిన్ ఎందుకు బ్యాన్ అయింది? అనే నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. మా ఫస్ట్ ఫ్లిప్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. మా హీరో చంద్రహాస్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ ఫ్లిప్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాను. నేను చంద్రహాస్ చేసిన ఆర్ఆర్ఆర్ కవర్ సాంగ్‌ని చూశాను. అందులో అతని ఎనర్జీ చూసి ఈ కథను చెప్పాను. ఈ కథను నాకంటే ఎక్కువగా చంద్రహాస్ నమ్మారు. నిమిషి మ్యూజిక్ అద్భుతంగా ఉండబోతోంది. సమ్మర్లో మా సినిమాని రిలీజ్ చేస్తాం’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ నిమిషి జాకియాస్ మాట్లాడుతూ.. ‘దర్శకుడు జైరామ్ నా స్నేహితుడు. ఈ మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చిన జైరామ్‌కు థాంక్స్. చంద్రహాస్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేయాలని జైరామ్ ఐదు రోజుల క్రితమే చెప్పాడు. రెండ్రోజుల క్రితమే పుటేజ్ పంపించాడు. పగలు, రాత్రి తేడా లేకుండా పని చేసి ఈ ఫస్ట్ ఫ్లిప్ కోసం పని చేశాను. ఈ చిత్రానికి మంచి మ్యూజిక్ వస్తోంది’ అని అన్నారు.