కింగ్ 100 నాటౌట్ కోసం మెగాస్టార్..!

కింగ్ 100 నాటౌట్ కోసం మెగాస్టార్..!

Published on Sep 17, 2025 10:00 PM IST

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్‌లో ల్యాండ్ మార్క్ 100వ చిత్రం గ్రాండ్‌గా తెరకెక్కేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దసరా పర్వదినం సందర్భంగా ఈ లాంచ్ కార్యక్రమం జరగనుంది. తమిళ దర్శకుడు కార్తిక్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌ కలిగి ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఇక ఈ సినిమాను అక్కినేని హోమ్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నాగార్జున నిర్మించనున్నారు. ఇక ఈ సినిమాకు “100 నాట్ ఔట్” అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట మేకర్స్. ఈ చిత్ర గ్రాండ్ లాంచ్ వేడుకలో ఇండస్ట్రీ దిగ్గజాలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా వచ్చి క్లాప్ కొట్టనుండగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. వీరి హాజరుతో ఈ వేడుక ఘనంగా మారనుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరి నాగార్జున కెరీర్ ల్యాండ్ మార్క్ మూవీ ఎలాంటి కథతో వస్తుందా.. ఇందులో ఎవరెవరు నటిస్తున్నారు.. అనే అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

తాజా వార్తలు