‘ఓజి’ సెన్సార్.. రెండూ అడుగుతున్న ఫ్యాన్స్!

‘ఓజి’ సెన్సార్.. రెండూ అడుగుతున్న ఫ్యాన్స్!

Published on Sep 17, 2025 9:01 PM IST

ప్రస్తుతం భారీ అంచనాలు సెట్ చేసుకొని రిలీజ్ కి వస్తున్న అవైటెడ్ చిత్రమే “ఓజి”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా ఇంకో వారంలో థియేటర్స్ లో సందడి చేయబోతుంది. ఇక ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ మాత్రం ఇపుడు ఈ సినిమా సెన్సార్ పరంగా రెండు వెర్షన్ లు చెబుతున్నారు. ప్రస్తుతం సినిమా సెన్సార్ పనుల్లో ఉండగా సెన్సార్ అయ్యాక వచ్చే సర్టిఫికెట్ కోసమే రచ్చ నడుస్తుంది.

కొంతమంది అభిమానులు కంప్లీట్ ‘ఏ’ సర్టిఫికెట్ కావాలని కోరుకుంటే ఏదొకలా యూ/ఏ రావాలని ఇంకొందరు కోరుకుంటున్నారు. ఇది మోస్ట్ వైలెంట్ కాంబినేషన్ పైగా మొదటి నుంచీ మంచి బ్లడ్ బాత్ ని ప్రామిస్ చేయడంతో కొందరు ఏ రావాల్సిందే అని కూర్చుంటే ఎక్కడ ఏ సర్టిఫికెట్ వస్తే ఫ్యామిలీ ఆడియెన్స్, 18 ఏళ్ళు లోపు ఉన్న ఆడియెన్స్ కౌంట్ తగ్గుతుందేమో అని ఇంకొందరు భయపడుతున్నారు. మరి సర్టిఫికెట్ ఏమొస్తుంది అనేది ఈ కొన్ని రోజుల్లో తేలిపోనుంది.

తాజా వార్తలు