హీరో నారా రోహిత్ నటించిన రీసెంట్ మూవీ ‘సుందరకాండ’ రిలీజ్‌కు ముందు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. నారా రోహిత్ చాలా కాలం తర్వాత లవర్ బాయ్ లుక్‌లో కనిపించడం.. ఈ సినిమాలో శ్రీదేవి విజయ్ కుమార్ కూడా నటించడంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అందరూ అనుకున్నారు.
వెంకటేష్ నిమ్మలపూడి డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి డీసెంట్ టాక్ లభించింది. కానీ, బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ కాలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
సుందరకాండ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ జియో హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 13 నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వ్రితి వాఘాని హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో నరేష్, వాసుకి ఆనంద్, సత్య తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.