క్రేజీ క్లిక్: ‘మన శంకర వరప్రసాద్ గారి’తో పూరీ సేతుపతి..!

క్రేజీ క్లిక్: ‘మన శంకర వరప్రసాద్ గారి’తో పూరీ సేతుపతి..!

Published on Sep 10, 2025 9:30 PM IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు” కోసం అందరికీ తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఎప్పటికప్పుడు ఫ్రెష్ బయటకి వస్తూ సాలిడ్ ట్రీట్ ని అందిస్తున్నాయి. ఇలా నిన్ననే ఓ కొత్త స్టిల్ మెగా అభిమానులని మంచి ఎగ్జైట్ చేస్తే లేటెస్ట్ గా మరో క్రేజీ క్లిక్ బయటకి వచ్చింది.

దీనితో విజయ్ సేతుపతి హీరోగా డాషింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ రెండు సినిమాల యూనిట్స్ కలిసి కనిపించడం జరిగింది. చిరంజీవి సహా విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్, ఛార్మి అలాగే అనీల్ రావిపూడి నయనతార ఇతర నటీనటులతో ఫ్రేమ్ అదిరిపోయింది. ఇలా ఈ ఊహించని క్రాసోవర్ ఇపుడు వైరల్ గా మారింది.

తాజా వార్తలు