మెగా కుటుంబం నుంచి వచ్చిన టాలెంటెడ్ హీరోస్ లో సుప్రీం హీరో ధరమ్ తేజ్ కూడా ఒకరు. మరి విరూపాక్ష, బ్రో సినిమాలతో అలరించిన తాను ఇపుడు చేస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రమే “సంబరాల ఏటి గట్టు”. దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ యాక్షన్ ప్రాజెక్ట్ పట్ల మంచి హైప్ ఉంది.
ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ వారు సాలిడ్ అప్డేట్ ని సాయి ధరమ్ తేజ్ పై ఒక క్రేజీ పోస్టర్ తో అందించారు. మరి సాయి ధరమ్ తేజ్ కూడా షేర్ చేసుకున్న ఈ పోస్టర్ లో తాను డైనమిక్ ప్రెజెన్స్ తో సిక్స్ ప్యాక్ లుక్ లో స్టన్నింగ్ గా కనిపిస్తున్నాడని చెప్పాలి. ఇక సినిమా అయితే ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ కి వచ్చినట్టు మేకర్స్ చెబుతున్నారు.
ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ సారథ్యంలో ఈ యాక్షన్ బ్లాక్ ని తెరకెక్కిస్తున్నారట. ఇక ఈ పోస్టర్ చూసిన నెటిజన్స్ అయితే మరింత ఎగ్జైట్ అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏకకాలంలో పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటించనున్నారు.