రవితేజ 76 మూవీ.. అప్పుడే అవి క్లోజ్..!

రవితేజ 76 మూవీ.. అప్పుడే అవి క్లోజ్..!

Published on Sep 8, 2025 2:00 PM IST

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం తన లేటెస్ట్ చిత్రం ‘మాస్ జాతర’ను రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు భాను బోగవరపు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా తర్వాత తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో చేస్తున్నాడు ఈ మాస్ హీరో.

రవితేజ కెరీర్‌లో 76వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను RT76 అనే ట్యాగ్‌తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర నాన్-థియేట్రికల్ రైట్స్ అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ జీ5 దక్కించుకోగా.. ఈ చిత్ర శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు ఛానల్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర నాన్-థియేట్రికల్ రైట్స్‌కు మంచి ఫ్యాన్సీ రేటు లభించినట్లు సినీ సర్కిల్స్ టాక్.

ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు