SSMB29 ఎపిక్ అనౌన్స్‌మెంట్ ఆ రోజేనా..?

SSMB29 ఎపిక్ అనౌన్స్‌మెంట్ ఆ రోజేనా..?

Published on Sep 7, 2025 3:00 AM IST

సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ చిత్రం SSMB29 ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కెన్యా, నైరోబి లో జోరుగా జరుగుతోంది. మహేష్ తన షెడ్యూల్‌ను పూర్తిచేసుకుని హైదరాబాద్‌కి తిరిగివచ్చారు.

ఆగస్ట్ 9న మహేష్ బర్త్‌డే సందర్భంగా దర్శకుడు రాజమౌళి, సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను నవంబర్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తాజా టాక్ ప్రకారం ఆ గ్లింప్స్‌తో పాటు సినిమా రిలీజ్ డేట్ కూడా అధికారికంగా బయటకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను 2027 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయాలని టీమ్ ఆలోచిస్తోందట. అయితే దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మరి గ్లోబల్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా నుంచి ఈ ఎపిక్ అనౌన్స్‌మెంట్ నిజంగానే త్వరలో రానుందా..? అనేది వేచి చూడాలి.

తాజా వార్తలు