‘ఉస్తాద్ భగత్ సింగ్’.. పవన్ నే ఎగ్జైట్ చేసిన దేవీ లేటెస్ట్ సాంగ్!

‘ఉస్తాద్ భగత్ సింగ్’.. పవన్ నే ఎగ్జైట్ చేసిన దేవీ లేటెస్ట్ సాంగ్!

Published on Sep 6, 2025 4:58 PM IST

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్”. మాస్ లో మంచి హైప్ ఉన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా పూర్తవుతుంది. ఇక రీసెంట్ గానే ఒక సాంగ్ షూట్ సహా క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ని మేకర్స్ పూర్తి చేశారు. అయితే ఈ సాంగ్ పౌ దేవిశ్రీ ప్రసాద్ కామెంట్స్ మంచి ఆసక్తిగా మారాయి.

పవన్ కళ్యాణ్ ఈ సాంగ్ కి డాన్స్ అదరగొట్టేసినట్టు తెలిపారు. ఆ సాంగ్ విన్నాక పవన్ వచ్చి కరచాలనం చేసి తనకే డాన్స్ చేయాలి అనిపించేలా ఈ సాంగ్ ఉందని చెప్పినట్టు తెలిపారు. దీనితో ఈ సాంగ్ విషయంలో మాత్రం అభిమానులు మరింత ఎగ్జైట్ అవుతున్నారు. అలాగే దీనిపైనే రీసెంట్ గా వదిలిన పోస్టర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు