2025 ‘సైమా’ అవార్డ్స్ టాలీవుడ్ లిస్ట్ ఇదే!

2025 ‘సైమా’ అవార్డ్స్ టాలీవుడ్ లిస్ట్ ఇదే!

Published on Sep 6, 2025 7:32 AM IST

Siima

ఇండియన్ సినిమాకి సంబంధించి ఉన్న పలు ప్రముఖ అవార్డులలో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్‌ (SIIMA) కూడా ఒకటి. మరి ప్రతీ ఏటా జరిగేలానే ఈసారి కూడా 2025 అవార్డుల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈసారి దుబాయ్ వేదికగా ఎంతో గ్రాండ్ గా జరిగిన ఈ వేడుకల్లో అనేకమంది సినీ ప్రముఖులు పాల్గొనడం జరిగింది.

ఇక ఈ ఈవెంట్ లో టాలీవుడ్ సినిమాకి సంబంధించి ఉత్తమ చిత్రం సహా ఉత్తమ నటుడుం దర్శకుడు ఇలా అనేక విభాగాల్లో ఎవరెవరు గెలుపొందారు అనే లిస్ట్ ఇపుడు బయటకు వచ్చింది. దీని ప్రకారం చూస్తే.. ఉత్తమ చిత్రంగా ‘కల్కి’ ఎంపికైంది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ అవార్డులు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్)గా ప్రశాంత్ వర్మ, ఉత్తమ నటుడు (క్రిటిక్స్)గా తేజ సజ్జా అవార్డులు అందుకున్నారు. ఇక మిగతా లిస్ట్ చూసుకున్నట్టయితే..

ఉత్తమ చిత్రం – కల్కి
ఉత్తమ దర్శకుడు – సుకుమార్
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) – ప్రశాంత్ వర్మ
ఉత్తమ నటుడు – అల్లు అర్జున్
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – తేజ సజ్జా
ఉత్తమ నటి – రష్మిక మందన్నా
ఉత్తమ నటి (క్రిటిక్స్) – మీనాక్షి చౌదరి
ఉత్తమ సహాయ నటుడు – అమితాబ్ బచ్చన్
ఉత్తమ సహాయ నటి – అన్నే బెన్
ఉత్తమ సంగీత దర్శకుడు – దేవి శ్రీ ప్రసాద్
ఉత్తమ గీతరచయిత – రామ్ జోగయ్య శాస్త్రి
ఉత్తమ గాయకుడు – శంకర్ బాబు కందుకూరి
ఉత్తమ గాయని – శిల్పా రావు
ఉత్తమ ప్రతినాయకుడు – కమల్ హాసన్
ఉత్తమ తొలి పరిచయం నటి – పంకూరి, భాగ్యశ్రీ బోర్స్
ఉత్తమ తొలి పరిచయ నటుడు – సందీప్ సరోజ్
ఉత్తమ పరిచయ దర్శకుడు – నంద కిషోర్ యేమని
ఉత్తమ కొత్త నిర్మాత – నిహారిక కొణిదెల
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – రత్నవేలు
ఉత్తమ హాస్యనటుడు – సత్య

ఇలా పలు విభాగాల్లో మన టాలీవుడ్ కి సైమా అవార్డులు దక్కాయి.

తాజా వార్తలు