టాక్.. ‘అఖండ 2’ రిలీజ్ పై కొత్త బజ్!

టాక్.. ‘అఖండ 2’ రిలీజ్ పై కొత్త బజ్!

Published on Sep 2, 2025 3:07 PM IST

Akhanda2

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమానే అఖండ 2 తాండవం. దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ సెప్టెంబర్ లోనే విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా పలు కారణాలు చేత వాయిదా పడింది.

మరి కొత్త డేట్ ఎప్పుడు అనేది ఫ్యాన్స్ లో సస్పెన్స్ గా మారగా ఇప్పుడు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి డిసెంబర్ స్లాట్ కన్ఫర్మ్ అయినట్టుగా టాక్ వచ్చింది. డిసెంబర్ 5న రాజా సాబ్ ఉంటే అది కాస్తా జనవరికి మారింది. దీనితో ఆ డేట్ ఖాళీ గానే ఉంది కదా అనుకుంటే ఇపుడు అఖండ 2 కూడా జనవరికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందని కొత్త టాక్ మొదలైంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే 14 రీల్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు