‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే కొత్త టాక్‌షోతో జగపతి బాబు హోస్ట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘కల్కి 2898 AD’, ‘మహానటి’, ‘సీతారామం’ వంటి హిట్ చిత్రాలను అందించిన నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తోంది. తొలి ఎపిసోడ్ నుంచే నాగార్జున, నాని, శ్రీలీల వంటి తారలతో పాటు జగపతి బాబు స్టైల్ హోస్టింగ్‌కు మంచి రెస్పాన్స్ లభించింది.
ఇప్పుడు ఈ షోలో మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ రాబోతోంది. అందులో ఎప్పుడూ తమదైన శైలిలో మాట్లాడే ఇద్దరు డైరెక్టర్స్ రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగ పాల్గొనబోతున్నారు. తమ అభిప్రాయాలను ఎటువంటి సంకోచం లేకుండా చెప్పడంలో వీరు స్పెషల్. అందుకే ఈ ఎపిసోడ్ మరింత క్రేజీగా మారబోతోందని చెప్పవచ్చు.
ఈ సెన్సేషనల్ ఎపిసోడ్ సెప్టెంబర్ 5న జీ5లో ప్రీమియర్ కానుండగా, సెప్టెంబర్ 7న రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారం అవుతుంది. తమ గత, ప్రస్తుత ప్రాజెక్టుల గురించి ఈ ఇద్దరు దర్శకులు ఏం చెబుతారో అని ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఒకరేమో Bold,మరొకరేమో Wild.. Beast Comboతో ఈ ఆదివారం Double Madness పక్కా✨????
Watch #JayammuNischayammuRaa on September 7th
at 9PM On #ZeeTelugu & Premieres On September 5th
On #Zee5#JayammuNischayammuRaaWithJagapathi#ZeeTeluguPromo @RGVzoomin @imvangasandeep @ZEE5Telugu… pic.twitter.com/cDr02Ei8MV— ZEE TELUGU (@ZeeTVTelugu) September 1, 2025