తేజ సజ్జ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ‘కల్కి 2’లో ఉన్నాడా?

తేజ సజ్జ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ‘కల్కి 2’లో ఉన్నాడా?

Published on Aug 31, 2025 3:31 PM IST

Kaliki and Mirai

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో ఒకరైన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం “మిరాయ్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్ లో తాను ఈ సినిమా చేస్తున్నాడు. అయితే హను మాన్ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత తన నుంచి మరో సూపర్ హీరో తరహా సినిమా ఇది కాగా లేటెస్ట్ గా మరో సినిమాటిక్ యూనివర్స్ లోకి తాను అడుగు పెట్టబోతున్నాడా అని తెలుస్తుంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ భారీ హిట్స్ లో ఒకటైన కల్కి 2898 ఎడి నిర్మాత స్వప్న దత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి చేసిన పోస్ట్ లో ‘కే’ లో కలుద్దాం అంటూ చేసిన పోస్ట్ మంచి ఆసక్తిగా మారింది. దీనితో అప్పుడే తాను కల్కి పార్ట్ 2 లో ఉన్నాడు అనే టాక్ విస్తృతంగా వైరల్ అవ్వడం మొదలైంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి.

తాజా వార్తలు