‘లిటిల్ హార్ట్స్’ నుంచి ‘చదువూ లేదు’ లిరికల్ రిలీజ్ చేసిన మేకర్స్!

‘లిటిల్ హార్ట్స్’ నుంచి ‘చదువూ లేదు’ లిరికల్ రిలీజ్ చేసిన మేకర్స్!

Published on Aug 27, 2025 3:08 PM IST

ప్రెజెంట్ టాలీవుడ్ యువతలో బాగా గుర్తింపు ఉన్న యువ నటుడు 90s మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ మౌళి తనుజ్, “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ “లిటిల్ హార్ట్స్”. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. “90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ “లిటిల్ హార్ట్స్” మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ గా రిలీజ్ చేస్తున్నారు. “లిటిల్ హార్ట్స్” సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

ఇక ఈ రోజు ఈ సినిమా నుంచి ‘చదువూ లేదు’ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటను క్యాచీ ట్యూన్ తో సింజిత్ యెర్రమల్లి కంపోజ్ చేశారు. స్వరూప్ గోలి లిరిక్స్ అందించగా, ‘మళ్లీశ్వరివే..’ సాంగ్ ఫేమ్ జెస్సీ గిఫ్ట్ పాడారు. ‘చదువూ లేదు’ పాట ఎలా ఉందో చూస్తే – ‘ చదువూ లేదు సంధ్యా లేదు, అయినా సూడు సిగ్గే రాదు, అంటూ సాగిన ఈ పాట సగటు మేడిన్ తెలుగు స్టూడెంట్ ఎలా ఉంటాడో ఈ పాటలో చూపించారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. థియేటర్స్ లోనూ ఇదే ఆదరణ దక్కుతుందని “లిటిల్ హార్ట్స్” టీమ్ నమ్మకంతో ఉంది.

తాజా వార్తలు