‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?

‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?

Published on Aug 26, 2025 10:00 AM IST

coolie

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే “కూలీ”. టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ చిత్రం డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ భారీ వసూళ్లు అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా కూలీ 500 కోట్ల మార్క్ దగ్గరకి వెళుతుండగా ఇందులో కేవలం తెలుగు వెర్షన్ వసూళ్లు సాలిడ్ గా వచ్చినట్టు తెలుస్తుంది.

లేటెస్ట్ పి ఆర్ లెక్కల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ తెలుగు వెర్షన్ వసూళ్లు కలిపి కూలీ 80 కోట్లకి పైగా గ్రాస్ ని ఇప్పుడు వరకు అందుకున్నట్టు తెలుస్తుంది. ఇది జైలర్ తర్వాత మళ్ళీ రజినీకాంత్ కెరీర్ లో భారీ గ్రాస్ అని చెప్పాలి. అయితే జైలర్ తరహా లోనే సాలిడ్ టాక్ ఈ సినిమాకి కూడా దక్కి ఉంటే తెలుగు వెర్షన్ లో డెఫినెట్ గా జైలర్ ని ఈజీగా క్రాస్ చేసేసి ఉండేదని చెప్పవచ్చు.

తాజా వార్తలు