చిరు, ఓదెల ప్రాజెక్ట్ కి దాదాపు అతడే?

చిరు, ఓదెల ప్రాజెక్ట్ కి దాదాపు అతడే?

Published on Aug 23, 2025 8:06 AM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి నుంచి రానున్న చిత్రాల్లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన సినిమా కూడా ఒకటి. ఇప్పుడు ఉన్న మొత్తం నాలుగు సినిమాలలో కూడా ఈ సినిమాపై అంచనాలు మాత్రం ప్రత్యేకం అని చెప్పాలి.

అయితే ఈ సినిమా విషయంలో నిన్న శ్రీకాంత్ ఓదెల ట్వీట్ కూడా ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహాన్ని అందించింది. ఇక ఇలాంటి బిగ్ ప్రాజెక్ట్ కి సంగీతం ఎవరు అనేది మరింత ఆసక్తికర ప్రశ్నగా మారింది. అయితే చాలా మంది సెన్సేషనల్ సంగీత దర్శకుడు అనిరుద్ పేరే ఆశిస్తున్నారు.

అయితే ఇందుకు దాదాపు ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అనిరుద్ మెగాస్టార్ కాంబినేషన్ లో మొదటి సినిమా ఇదే కావచ్చు అన్నట్టు వినిపిస్తుంది. ఆల్రెడీ అనిరుద్ తో శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం “ది ప్యారడైజ్” చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా తర్వాత బాస్ చిత్రానికే అందించే ఛాన్స్ ఉందట. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

తాజా వార్తలు