‘ఖైదీ 2’ బదులు ఈ దర్శకునితో పని చేయనున్న కార్తీ?

‘ఖైదీ 2’ బదులు ఈ దర్శకునితో పని చేయనున్న కార్తీ?

Published on Aug 22, 2025 8:01 PM IST

Karthi

ప్రస్తుతం తెలుగు సహా తమిళ ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రాల్లో లాంగ్ అవైటెడ్ కార్తీ చిత్రం “ఖైదీ 2” కూడా ఒకటి. నిజానికి ఎప్పుడో మొదలు కావాల్సిన ఈ చిత్రం అలా ఆలస్యం అవుతూ వస్తుంది. మరి ఈ సినిమా కోసం మరింత కాలం ఎదురు చూపులు తప్పేలా లేవు అని ఆల్రడీ కోలీవుడ్ నుంచి హింట్స్ వచ్చేసాయి.

దీనిథి కార్తీ ఈ సినిమా కోసం రెడీ చేసుకున్న డేట్స్ లో మరో దర్శకునికి అవకాశం ఇచ్చేస్తున్నట్టుగా లేటెస్ట్ టాక్ బయటకి వచ్చింది. దీనితో తమిళ ప్రముఖ దర్శకుడు సుందర్ సి తో వర్క్ చేసేందుకు కార్తీ తన ఖైదీ 2 స్లాట్ ని ఇచ్చేశాడట. అరణ్మణై సిరీస్ తో తమిళ్ లో సాలిడ్ హిట్స్ అందించిన ఈ దర్శకుడు ఇపుడు కార్తీతో ఎలాంటి ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు