ఓటిటిలో ‘వీరమల్లు’ ట్విస్ట్!

ఓటిటిలో ‘వీరమల్లు’ ట్విస్ట్!

Published on Aug 20, 2025 10:04 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా నటించిన లేటెస్ట్ సినిమానే “హరిహర వీరమల్లు”. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఊహించని విధంగా ప్లాప్ అయ్యింది. అయితే ఆ థియేట్రికల్ రన్ తర్వాత ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ఈ చిత్రం ఒక్క కన్నడ మినహా మిగతా భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఓటిటి ఆడియెన్స్ కి మాత్రం ఈ సినిమా ట్విస్ట్ ఇచ్చింది అని చెప్పాలి.

సినిమాలో చాలా వరకు సీన్స్ ని మేకర్స్ తీసేసారు. అంతే కాకుండా క్లైమాక్స్ ని కూడా అసుర హననం సాంగ్ తోనే ఎండ్ చేసేసారు. బాబీ డియోల్, పవన్ కళ్యాణ్ పై సన్నివేశాన్ని కూడా తొలగించారు. దీనితో సోషల్ మీడియాలో మాత్రం కొంచెం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది ఉంచితే బాగుణ్ణు అంటున్నారు. మరికొంతమంది మంచి పని చేసారని అంటున్నారు.

తాజా వార్తలు