అఖండ 2: బాలయ్య మొదటి 100 కోట్లు

అఖండ 2: బాలయ్య మొదటి 100 కోట్లు

Published on Oct 10, 2025 10:31 AM IST

Akhanda2

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అవైటెడ్ సాలిడ్ డివోషనల్ డ్రామానే అఖండ 2 తాండవం. తన హిట్ మెషిన్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కించిన ఈ అవైటెడ్ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము లేపేందుకు వస్తుంది. అయితే ఈ సినిమాతో బాలయ్య తన మొదటి 100 కోట్ల మార్కెట్ ని టచ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది వరకే బాలయ్యకి వరుస 100 కోట్ల గ్రాసర్ లు ఉన్నాయి.

కానీ ఇది వసూళ్ల కోసం కాదు తన బిజినెస్ కోసం. అఖండ 2 తో థియేట్రికల్ గా బాలయ్య మార్కెట్ 100 కోట్ల మార్క్ దాటేసినట్టు తెలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అఖండ 2 కి 100 కోట్లకి పైగానే అన్ని భాషల్లో కలుపుకొని బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. దీనితో బాలయ్య మొదటి 100 కోట్ల షేర్ సినిమా కూడా దీనితోనే మొదలు కానుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా ఈ డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

తాజా వార్తలు