ఇప్పుడిప్పుడు ఊపందుకున్న పాన్ ఇండియా రిలీజ్ అండ్ మార్కెట్ ని ఎప్పుడో బాలీవుడ్ సినిమా నుంచి కూడా మొదలైంది. అలా ఎన్నో ఏళ్ళు కితం నుంచే ఉన్న పాన్ ఇండియా సిరీస్ లో ‘ధూమ్’ సిరీస్ కూడా ఒకటి. సాలిడ్ యాక్షన్ ఫ్రాంచైజ్ గా తెరకెక్కించిన ఈ సిరీస్ కి మన తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇలా వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ కాగా ఇక నాలుగో ఇన్స్టాల్మెంట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ధూమ్ 4 కోసం చూస్తున్న అభిమానులకి ఏదొక కొత్త రూమర్ వినిపిస్తూనే వస్తుండగా లేటెస్ట్ గా ఈ సినిమా కోసం మేకర్స్ ఓ టాలీవుడ్ స్టార్ హీరోని సంప్రదించినట్టుగా ఇపుడు తెలుస్తుంది. ధూమ్ 4 చిత్రాన్ని లేటెస్ట్ వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించనుండగా తాను ఓ కీలక పాత్ర కోసం తెలుగు స్టార్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. మరి ఆ స్టార్ ఎవరు? ఒప్పుకున్నారా? లేదా అనేది మాత్రం ఇంకా బయటకి రావాల్సి ఉంది.