దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన కూలీ చిత్రం రిలీజ్‌కు ముందు సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. కట్ చేస్తే.. ఈ సినిమా రిలీజ్ తర్వాత మిక్సిడ్ టాక్‌తో రన్ అవుతుంది. లోకేష్ నుంచి వచ్చిన వీక్ రైటింగ్ అంటూ క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక కూలీ చిత్రంలో భారీ క్యాస్టింగ్ ఉండటంతో వారి పాత్రలు ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తాయని చిత్ర యూనిట్ చెబుతూ వచ్చింది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఈ సినిమాలో ఓ క్యామియో రోల్ చేస్తున్నాడని మేకర్స్ రివీల్ చేయడంతో.. ఆయన పాత్ర విక్రమ్ చిత్రంలోని సూర్య పోషించిన రోలెక్స్ తరహాలో ఉంటుందని అందరూ ఆశించారు. నిజానికి రోలెక్స్ ని మించిన పాత్ర ఇది అవుతుందని లోకేష్ అండ్ టీమ్ ప్రచారం చేశారు.
కానీ, సినిమా రిలీజ్ తర్వాత అమీర్ ఖాన్ పోషించిన దాహ పాత్ర చాలా చప్పగా అనిపించింది. ఏమాత్రం పవర్‌ఫుల్‌గా లేకుండా ఈ పాత్రను లోకేష్ ప్రెజెంట్ చేసిన తీరు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో రోలెక్స్ తరహా పాత్రను బీట్ చేయాలంటే చాలా కష్టమని సూర్య ఫ్యాన్స్‌తో పాటు లోకేష్ ఫ్యాన్స్ కూడా అంటున్నారు. ఏదేమైనా అమీర్ ఖాన్ రోలెక్స్‌ని టచ్ కూడా చేయలేకపోయాడని వారు కామెంట్స్ చేస్తున్నారు.