మన తెలుగు సినిమా దగ్గర నిర్మాణ సంస్థలకి కొదవ లేదు. అయితే ప్రతీ నిర్మాణ సంస్థలో కూడా అన్నీ హిట్ సినిమాలే ఉన్నాయని చెప్పడానికి కూడా లేదు. కానీ దాదాపు హిట్స్ తోనే సాలిడ్ కంటెంట్ ని ప్రపంచ వ్యాప్త ఆడియెన్స్ కి అందిస్తూ బ్లాక్ బస్టర్ ట్రీట్ ఇచ్చిన అరుదైన అతికొద్ది నిర్మాణ సంస్థల్లో మైత్రి మూవీ మేకర్స్ కూడా ఒకరు. సరిగ్గా ఇదే రోజున పదేళ్ల కితం సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన మొదటి సినిమా “శ్రీమంతుడు” తోనే ఇండస్ట్రీ షెకయ్యే హిట్ ని అందుకున్నారు.
ఇక అక్కడ నుంచి వరుస విజయ పరంపర కొనసాగింది. రంగస్థలం రీజనల్ గా హైయెస్ట్ గ్రాసర్, జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ కి ఒక సెన్సేషనల్ కంబ్యాక్, పుష్ప కోసం చెప్పక్కర్లేదు. బాలయ్యతో వీరసింహా రెడ్డి, మెగాస్టార్ తో వాల్తేరు వీరయ్య అయితే తమకి ఊహించని లాభాలు ఇచ్చింది అని తెలిపారు. రీసెంట్ గా పుష్ప 2 తో ఇండియా లోనే హైయెస్ట్ గ్రాసర్ ని వీరు సొంతం చేసుకున్నారు.
జాట్, గుడ్ బ్యాడ్ అగ్లీతో తమిళ, హిందీ సినిమాలో కూడా ముద్ర వేసుకుని అక్కడా హిట్ డెబ్యూ అందుకున్నారు. ఇక ఇలా భారీ సినిమాలే కాకుండా మిడ్ రేంజ్ సినిమాలూ చేసి బ్లాక్ బస్టర్స్ కొట్టారు. ఒక ఉప్పెన, మత్తు వదలరా, డియర్ కామ్రేడ్ లాంటి యూత్ ఫుల్ క్లాసిక్ హిట్స్ నీ అందించారు. ఇలా మొత్తం పదేళ్లలో సాలిడ్ హిట్స్ అందించిన ఈ సంస్థ నుంచి ఇపుడు మరిన్ని సినిమాలు ఆల్రెడీ సెట్స్ మీద ఉన్నాయి.
ఉస్తాద్ భగత్ సింగ్, ఎన్టీఆర్ నీల్, ప్రభాస్ హను ప్రాజెక్ట్, పెద్ది, ఆంధ్రా కింగ్ తాలూకా, జై హనుమాన్, డ్యూడ్, విజయ్ దేవరకొండ 14, రామ్ చరణ్ 17 ఇలా బిగ్గెస్ట్ లైనప్ తో సిద్ధంగా ఉన్నారు. ఇక ఇవే కాకుండా రానున్న ఐదేళ్లలో ఏకంగా 45 సినిమాలు అందించాలని సన్నద్ధం అవుతున్నారు. మరి మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఫ్యూచర్ ప్లానింగ్ మాత్రం ఊహించని లెవెల్లో ఉందని చెప్పవచ్చు.